Saturday, March 14, 2026
HomeTrending Newsగోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోవాలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, అతని భార్య దెలీలా లోబో, రాజేష్ ఫాల్దేశాయి, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ బిజెపిలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో గోవాలో కాంగ్రెస్‌ బలం 11 నుంచి మూడుకు పడిపోనుంది. వీరంతా గోవా సీఎం ప్రమోద్ సావంత్ ను కొద్దిసేపటి క్రితం ఆయన చాంబర్‌లో కలిశారు.

ఆయనతో చర్చల అనంతరం వారు గోవా శాసనసభకు చేరుకున్నారు. స్పీకర్ ను కలవనున్నారు. గోవాలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద్ శేఠ్ తనవాడే ఈ రోజు (బుధవారం)  ఉదయమే ప్రకటించారు. 2019 జూలైలో కూడా ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గుడి, దర్గా, చర్చిల వద్ద తాము ఎన్నికల్లో గెలిస్తే ఇతర పార్టీలకు ఫిరాయించబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న ఎనిమిది మంది కూడా ప్రతిజ్ఞ చేసినవారిలో ఉన్నారు.

వారు విధానసభ స్పీకర్‌ను కలిశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా విడిపోతే – పార్టీ బలంలో మూడింట రెండొంతుల బలం పోతుంది. అంటే – ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటును తప్పించుకోవచ్చు. గోవాలో 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుండి ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులు ఉన్న సభలో 25 మందితో బీజేపీకి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది వచ్చిన తర్వాత ఇది 33కి చేరుకుంటుంది.

Also Read: చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులవే : మంత్రి తలసాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular