Friday, April 25, 2025
HomeజాతీయంJodo Yatra: కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ మృతి

Jodo Yatra: కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ మృతి

రాహుల్ గాంధీ భరత్ జోడో యాత్రలో విషాద సంఘటన చోటు చేసుకుంది. యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేత. జలంధర్ లోక్ సభ సభ్యుడు సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. రాహుల్  యాత్ర ప్రస్తుతం పంజాబ్ లో కొనసాగుతోంది.

ఈ ఉదయం లధోవాల్ నుంచి ప్రారంభమైన యాత్ర ఫిల్లౌర్ కు చేరాల్సి ఉంది. ఫిల్లౌర్ అసెంబ్లీ కి సంతోక్ కుమారుడు విక్రమ్ జిత్ సింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాత్ర మొదలైన కాసేపటికే సంతోఖ్ కుప్పకూలారు. వెంటనే ఆయన్ను సమీపంలో ఉన్న ఫగ్వారా లోని విర్క్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంతోఖ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  సంతోఖ్ గుండెపోటుతోనే చనిపోయారని ఆయన్ను పరీక్షించిన వైద్యుడు డా. జస్జీత్ సింగ్ వెల్లడించారు.

ఈ విషాద వార్త తెలియగానే రాహుల్ గాంధీ తన యాత్రను మధ్యలోనే విరమించి సంతోఖ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జలంధర్ చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్