Friday, March 20, 2026
HomeTrending Newsకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రాహూల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రాహూల్

Rahul on Paddy: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై తెలుగులో రాహుల్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.  రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి, తెలంగాణ లో రైతుల చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది” అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

Also Read : ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్ నిరసనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular