Monday, June 17, 2024
HomeTrending Newsమీరూ వెల్ లోకి రండి: కవిత కౌంటర్

మీరూ వెల్ లోకి రండి: కవిత కౌంటర్

Counter: ధాన్యం సేకరణపై కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ట్వీట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం మాని, పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్దతివ్వాలని సూచించారు.

ధాన్యం సేకరణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని, ఈ ద్వంద్వనీతిపై తమ ఎంపీలు కేంద్రంతో పార్లమెంట్ లోపలా, బైట పోరాడుతున్నారని, ఈ అంశంపై మీకు నిజాయతీ ఉంటే తమ ఎంపీల ఆందోళనలో కలిసి రావాలని సూచించారు. ఎంపీలు ఉభయ సభల వెల్ లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారని, మీరు కూడా వెల్ లోకి వచ్చి నిరసన తెలపాలని కోరారు.

Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రాహూల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్