Lepakshi: అనంతపురము జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఆలయానికి అపురూపమైన ఖ్యాతి దక్కింది. అరుదైన గుర్తింపు కలిగిన దేవాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి ఆలయానికి స్థానం లభించింది. మన భారత దేశం నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు చోటు దక్కగా లేపాక్షి కూడా ఈ ఘనత పొందింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ తరహా గుర్తింపు సాధించిన తొలి కట్టడంగా లేపాక్షి నిలిచింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను విడుదల చేయనుంది.
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన వరంగల్ లోని రామప్ప దేవాలయానికి గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కిన విషయం తెలిసిందే.
లేపాక్షి వీరభద్రుని ఆలయాన్ని సా.శ. 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని చరిత్ర చెబుతోంది.
లేపాక్షి దేవాలయం కూడా రామప్ప ఆలయ తరహాలోనే వారసత్వ హోదా దక్కించుకోవాలని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు.
Also Read : చరితకు సాక్షి- లేపాక్షి