Sunday, November 24, 2024
HomeTrending Newsమేఘాలయ సిఎంగా రేపు సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయ సిఎంగా రేపు సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు స్థానిక పార్టీలైన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (UDP), పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (PDF) మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే 13 స్థానాలు అధికమయ్యాయి. ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంగ్మా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని 60 స్థానాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు గత నెల 27న జరిగిన ఎన్నికలు జరిగాయి. ఈ నెల 2న వెలువడిన ఫలితాల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 26 స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని పాత మిత్రపక్షమైన బీజేపీ 2, హెచ్‌ఎస్‌పీడీపీ 2, కాంగ్రెస్‌ (Congress) 5, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఐదు చొప్పున, యూడీపీ 11, పీడీఎఫ్‌ 2 స్థానాల చొప్పున గెలుపొందాయి. దీంతో అక్కడ హంగ్‌ ఏర్పడింది.

అయితే సంగ్మాకు బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీ, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్‌పీపీ బలం 32కు చేరింది. తాజాగా యూడీపీ, పీడీఎఫ్‌లు కూడా సంగ్మా నేతృత్వంలోని మేఘాలయా డెమొక్రటిక్‌ అలయన్స్‌ (MDA)లో భాగస్వాములుగా చేరాయి. ఈనేపథ్యంలో ఎండీఏ మొత్తం బలం 45కు చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్