నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ నోట్ల రద్దు పై స్పందించారు. ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ పన్నిన పన్నాగమే నోట్ల రద్దు చర్యగా ఆయన అభివర్ణించారు. పెట్టుబడి దారుల రహస్య ఎజెండాను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు పరుస్తుంది అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ గా ఆయన చెప్పుకొచ్చారు.

అసలు 2,000 నోట్లను ఎందుకు తెచ్చారో… ఎందుకు రద్దు చేశారో అన్నది దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తొలిసుకొచ్చారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. ఏమి ఆశించి ఈ చర్యకు ఉపాక్రమించారు అని సర్వత్రా వె లువడుతున్న అనుమానలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత మోడీ సర్కార్ పై ఉందన్నారు. నోట్ల రద్దు వెనుక ఉన్న బిజెపి రహస్య ఎజెండాను బహిర్గతం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రయోజనం ఉందని భావిస్తే బహిరంగ పరచడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తేల్చి చెప్పాలన్నారు. ఆర్. బి. ఐ ని ముందు పెట్టి ప్రజల కళ్ళు గప్పే ప్రయత్నం తప్ప మరోటి కాదని ఆయన మోడీ సర్కార్ పై మండిపడ్డారు. దేశంలో బిజెపి ప్రభుత్వం పతనావస్థ కు చేరుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *