గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం -తలసాని

Tamili sai – TRS cold war: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిలి సై ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజల చేత రెండుసార్లు ఎన్నుకోబడ్డ ప్రభుత్వమని… మేము నామినేటెడ్ వ్యక్తులం కాదని ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదన్నారు.  తెలంగాణ భవన్ లో ప్రారంభమైన హైదరాబాద్ జిల్లా స్థాయి TRS పార్టీ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ గవర్నర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. గవర్నర్ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రితో పనిచేయటం కష్టమని, ఇష్టం లేదని గవర్నర్ చెప్పటం సరికాదని, ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి తలసాని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు, మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు సరికాదని, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ పరిపాలనలో చాలా తక్కువగా ఉంటుందన్నారు. గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండని హితవు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయన్నారని గుర్తు చేశారు. ఆ విషయం గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా TRS అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, మేయర్ విజయలక్ష్మి, MLC లు, MLA లు, కార్పొరేషన్ చైర్మన్ లు, కార్పొరేటర్ లు, నియోజకవర్గ ఇంచార్జి లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Also Read : మంత్రుల విమర్శలు అర్థరహితం – గవర్నర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *