Monday, January 20, 2025
HomeTrending NewsCorona Virus: 11వేలకు చేరువలో కరోనా యాక్టివ్‌ కేసులు

Corona Virus: 11వేలకు చేరువలో కరోనా యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,573 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 4,47,07, 525కి చేరింది.

ఇక దేశంలో యాక్టివ్‌ కేసులు 11వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం 10,981 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కరోనా కారణంగా ఒక్క కేరళలోనే నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,841కి చేరింది. మరోవైపు కరోనా మహమ్మారి నుంచి 4,41,65,703 మంది కోలుకున్నారు.

ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,65,361) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్