Sunday, November 24, 2024
HomeTrending Newsకోవిడ్ ఆంక్షలు పట్టించుకోని చైనా ప్రజలు

కోవిడ్ ఆంక్షలు పట్టించుకోని చైనా ప్రజలు

జీరో కొవిడ్‌ పాలసీతో చైనాలో లాక్‌డౌన్‌ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. కరోనా కొత్త కేసులు భారీగా వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్‌ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వీటి నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని బీబీసీ ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.

చైనా జీరో కోవిడ్ పాలసీ పై ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీజింగ్, షాంఘై నగరాల్లో పౌరులు రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోవిడ్ నిబంధనలు సరళతరం చేస్తుంటే చైనాలో ఆంక్షల పేరుతో వ్యక్తీ స్వేఛ్చను హరిస్తున్నారని నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు వుహన్ నుంచే  కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తం అయిందని .. అమెరికా సెనెట్ కమిటీ ప్రకటించింది. మూడు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన సమాచారం… వివిధ ప్రజా సమూహాల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం కరోనాకు పుట్టినిల్లు వుహన్.. అందుకు చైనా ప్రభుత్వానిదే బాధ్యతని సెనేట్ కమిటీ నివేదికలో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్