Monday, February 24, 2025
HomeTrending Newsబిల్ క్లింటన్‌కు కరోనా

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్‌ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉన్నది. అందువల్ల అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని క్లింటన్ ట్వీట్ చేశారు.
76 ఏళ్ళ క్లింటన్‌.. 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి వరుసగా ఆయనను అనారోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. గుండెపోటు రావడంతో స్టంట్లు వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్