Saturday, April 5, 2025
HomeTrending Newsనిలకడగా సోనియాగాంధి ఆరోగ్యం

నిలకడగా సోనియాగాంధి ఆరోగ్యం

కోవిడ్ వైరస్ బారిన పడిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది. సోనియా గాంధీ ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారని, ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ ఆదివారం ప్రకటించింది. “కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. వైద్యుల పరిశీలన కోసం ఆస్పత్రిలో చేరారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

సోనియాగాంధీకి జూన్ రెండో తేదీన కరోనా వైరస్‌గా తేలింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని గడువు కోరారు. ఈ మేరకు జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆమె కుమారుడు, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా జూన్ 13న ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపించింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జూన్ 13న హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ రాహుల్ గాంధీని కోరింది.

ఈ కేసును అధికార బీజేపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో సోమవారం రాహుల్ గాంధీ విచారణకు హాజరైనప్పుడు పెద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్