Monday, June 29, 2026
HomeTrending Newsనీతులు వల్లిస్తున్న వ్యాపం దోషి -మంత్రి హరీష్

నీతులు వల్లిస్తున్న వ్యాపం దోషి -మంత్రి హరీష్

హైదరాబాద్ లో నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని, వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెరాసాను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు శివరాజ్ సింగ్ కు లేదన్నారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఈ రోజు జరిగిన రైతు బంధు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం  అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ నీతుల వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లగా సీఎంగా ఉండి  ఎం సాధించావన్న హరీష్ రావు తెలంగాణతో‌ మీ రాష్ట్రం దేనికి పోలిక అని ప్రశ్నించారు. ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు.

బిజెపి నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానంగా సవివరంగా చెప్పారని గుర్తుచేశారు. మీ మధ్యప్రదేశ్ లో పెద్ద కుంభకోణం జరిగిందని, వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి అని హరీష్ అడిగారు. ఎవరికైనా శిక్ష పడిందా.. మనుషులనే మీరు చంపేసారు. మీ కుంటుబ‌ సభ్యుల మీద, మీ పార్టీ నేతలకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని అన్నారు. 317 జీవో రద్దు చేయాలా‌‌…అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా… నిరుద్యోగులకు ఉద్యోగాలు‌ రావాలని సీఎం భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దను బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి హరీష్ ఆరోపించారు.

Also Read : కెసిఆర్ నియంతృత్వాన్ని అంతమొందిస్తాం – బిజెపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular