Sunday, November 24, 2024
HomeTrending NewsKarnataka: కర్ణాటకలో బిజెపికి ఎదురు గాలి

Karnataka: కర్ణాటకలో బిజెపికి ఎదురు గాలి

కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొన‌సాగుతోంది. అధికార బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్‌ ముగిసే సరికి కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. సీఎం బసవరాజ్‌ బొమ్మై మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రులు సీటీ రవి, అశోక్‌, సోమన్న, సుధాకర్‌, గాలి శ్రీరాములు, జార్క్‌హోలి ప్రత్యర్థులకంటే వెనుకబడిపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి మారిన మంత్రులు సవాదీ, జగదీశ్‌ షట్టర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా ముందంజలో ఉన్నారు.

ఇక బెంగళూరు, కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. సెంట్రల్‌ కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటక, నార్త్‌ కర్ణాటక, మైసూరు రీజియన్లలో కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉన్నది. మైసూరు ప్రాంతంలో బీజేపీ కన్నా జేడీఎస్‌ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.

కర్ణాటకలో కీల‌కంగా మార‌నున్న జేడీఎస్ కూడా మెరుగ్గా రాణిస్తోంది. ఈ నేప‌థ్యంలో జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమార‌స్వామి మాట్లాడారు. త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కాంటాక్ట్ కాలేద‌న్నారు. త‌న‌కు డిమాండ్ లేద‌ని, త‌న‌దో చిన్న పార్టీ అని కుమార‌స్వామి అన్నారు. రాబోయే 2-3 గంట‌ల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీగా స్కోర్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కుమారస్వామి తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్