Saturday, July 27, 2024
HomeTrending News22 రౌండ్లలో హుజురాబాద్ కౌంటింగ్...

22 రౌండ్లలో హుజురాబాద్ కౌంటింగ్…

హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలు కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది. ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్