Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ విడుదల

పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్‌ ‘పుష్ప‌-2’. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న  విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాట రికార్డులు సృష్టించింది. ‘పుష్ప పుష్ప’ సాంగ్ అంటూ సాగే ఆ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధించి రికారులు నెలకొల్పింది.  తాజాగా  రెండో పాటను కూడా చిత్రం యూనిట్ విడుదల చేసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే  ఈ పాటను కపుల్ సాంగ్ అంటూ  ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

దేవి శ్రీ ప్రసాద్‌  స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. శ్రేయా ఘోష‌ల్ పాడారు. అల్లు అర్జున్‌ మరియు హీరోయిన్‌ రష్మిక మందన్న పై చిత్రీకరించిన ఈ పాట  అభిమానులను ఆకట్టుకుంటోంది. పుష్ప-2 సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పతో  ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్