Saturday, March 7, 2026
HomeTrending NewsBritain: రిషీ సునాక్‌ మంత్రివర్గంలో మరో భారత సంతతి మహిళ

Britain: రిషీ సునాక్‌ మంత్రివర్గంలో మరో భారత సంతతి మహిళ

రిషీ సునాక్‌ నేతృత్వంలోని బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినోను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్‌ నియమించారు. ప్రస్తుతం ఇంధనశాఖ మంత్రిగా ఉన్న గ్రాంట్‌ షాప్స్‌ రక్షణ మంత్రిగా పదోన్నతి పొందారు.

ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రధానితో కలిసి పనిచేసి ఇంధన భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తానని, ఇళ్లలో వాడే కరెంటు బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తానని క్లెయిర్‌ కౌటినో తెలిపారు. శుద్ధ, చవకైన, స్థానికంగా ఉత్పత్తి చేసే ఇంధనానికి ప్రాధాన్యమిస్తానని కౌటినో తన నియామకం అనంతరం ట్వీట్‌ చేశారు.

సునాక్‌లాగే బ్రిటన్‌లో జన్మించిన కౌటినో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్‌ చేశారు. ఈస్ట్‌ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సునాక్‌ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా నియమితురాలయ్యారు. గతంలో బ్రిటన్‌ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా, సునాక్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా, ఖజానాకు ఛాన్సెలర్‌గా కౌటినో పని చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular