Saturday, January 18, 2025
HomeTrending Newsనిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు కూల్చివేత

నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు కూల్చివేత

తాడేపల్లి సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్దీయే కూల్చివేసింది.  జేసీబీలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను నెలమట్టం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటివరకూ తాడేపల్లిలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం దీన్ని మాజీ సిఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి మార్చారు.

అయితే జగన్ ప్రభుత్వంలో వైసీపీ కార్యాలయం కోసం తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో ఓ రెండెకరాల స్థలాన్ని కేటాయించి దానిలో ఆరు నెలల క్రితం నిర్మాణం మొదలు పెట్టారు.  ప్రభుత్వం స్థలంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చట్ట విరుద్ధమని గతంలో జనసేన, టిడిపిలు ఆందోళన చేశాయి. పైగా అది బోటు యార్డ్ కు చెందిన స్థలమని, దాన్ని లీజు పేరుతో పార్టీ ఆఫీసుకు ఇవ్వడం సరికాదని పలువురు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు.

ప్రభుత్వం మారడంతో సీఆర్దీఏ అధికారులు రంగంలోకి దిగి ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్మాణం మొదలు పెట్టారని, ఈ భవనం పూర్తయితే సీడ్ యాక్సిస్ రోడ్ కు భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని పేర్కొంటూ ఉదయం 5:30 గంటల సమయంలో  పొక్లైన్లు, బుల్డోజర్లతో…  శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేత మొదలు పెట్టారు.

కూల్చివేతకు సీఆర్డీయే ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ  వైఎస్సార్సీపీ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ చీమలపాటి రవి  ఈ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పును  సీఆర్డీయే కమిషనర్‌కు వైయస్సార్‌సీపీ న్యాయవాది అందజేశారు.

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ భవనాన్ని కూల్చి వేశారని వైసీపీనేతలు విమర్శిస్తున్నారు. హ్యకర్లు ఆదేశాలున్నా ఉదయాన్ని బుల్దోజర్లతో కూల్చివేయడం అన్యాయమని, అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఈ  విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వారు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్