TNGOs- Zones:
ఉద్యోగుల విభజన త్వరగా చేయాలని, ఏ జిల్లా ఉద్యోగిని అదే జిల్లాలో సర్దుబాటు చేయాలని తెలంగాణా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ విధానాన్ని అమలుచేయాని కోరారు. టిఎన్జీవో, టిజీవో సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కారదర్శి సోమేశ్ కుమార్ తో సమావేశమయ్యారు. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగులు, పోస్టుల కేటాయింపుపై చర్చించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
ఉద్యోగులందరికీ కేడర్ల వారీగా ఆప్షన్స్ కేటాయిస్తామని సిఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో తొలిదశలో పోస్టులు, ఉద్యోగులను కేటాయిస్తామని, మిగిలిన జిల్లాల్లో కోడ్ అఫ్ కాండక్ట్ ఎత్తేసిన తర్వాత కేటాయిస్తామని సిఎస్ ఉద్యోగులకు వివరించారు.
Also Read : కేంద్రం తీరు కర్కశంగా ఉంది: నిరంజన్ రెడ్డి