Sunday, June 7, 2026
Homeసినిమా‘బంగార్రాజు’ నుంచి ‘నా కోసం’ సాంగ్ విడుదల

‘బంగార్రాజు’ నుంచి ‘నా కోసం’ సాంగ్ విడుదల

Bangarraju_Naa Kosam:
కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘లడ్డుండా’ ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది. సెకండ్ సింగిల్ ‘నా కోసం’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

నేడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది. నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Also Read : డిసెంబర్ 1న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular