Monday, May 20, 2024
Homeసినిమా'కస్టడీ' ఇంట్రస్టింగ్ అప్ డేట్

‘కస్టడీ’ ఇంట్రస్టింగ్ అప్ డేట్

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తుంటే… ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడం విశేషం.

ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల న్యూయర్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చేయని పవర్ ఫుల్ రోల్ చైతన్య చేస్తుండడంతో ఈ మూవీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగచైతన్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ చిత్రంలో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ రాంకీ నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ అధికారికంగా ఇదే విషయాన్ని ఆన్‌లైన్‌లో ప్రకటించారు.

ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థ్యాంక్యూ మూవీతో నాగచైతన్య ఆశించిన విజయాన్ని అదుకోలేకపోయారు. దీంతో ఈ సినిమా పై అభిమానులతో పాటు నాగచైతన్య కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని మే 12న విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి.. కస్టడీ మూవీతో నాగచైతన్య బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్