Friday, March 29, 2024
Homeసినిమా'కస్టడీ' మూవీ టీజర్‌ డేట్

‘కస్టడీ’ మూవీ టీజర్‌ డేట్

నాగ చైతన్య, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు చైతన్య మొదలు పెట్టాడు. ఈ సినిమాలో హై ఆక్టేన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా  విడుదల చేసిన  చైతన్య లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  సాహసం శ్వాసగా సాగిపో తర్వాత  ఈ సినిమాలో చైతన్య మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘బంగార్రాజు’ తర్వాత మరోసారి ఈ సినిమాలో  కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 16న సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఒంటిపై ఖాకీ డ్రెస్‌తో వస్తున్న నాగ  చైతన్య ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఏ మెప్పిస్తాడనేది చూడాలి. అరవింద్‌ స్వామి విలన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య గత సినిమాలకు బిన్నంగా ఈ సినిమా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్