Saturday, June 6, 2026
HomeసినిమాCustody Movie Trailer - న్యాయం పక్కన నిలబడి చూడు.. 'కస్టడీ' ట్రైలర్ వచ్చేసింది..

Custody Movie Trailer – న్యాయం పక్కన నిలబడి చూడు.. ‘కస్టడీ’ ట్రైలర్ వచ్చేసింది..

నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’. ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మే 12న థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, పోలీసుల గొప్పతనాన్ని తెలిపే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. సీఎం సెక్యూరిటీకని పంపిస్తే.. నాగ చైతన్య ఆమె బండినే ఆపేయడం డ్యూటీలో తన నిజాయితిని చూపిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య శివ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ట్రైలర్‌ చూస్తుంటే ఈ సారి అక్కినేని అభిమానులకు గ్రహాల మూమెంట్‌ ఎక్కడో స్టార్ట్‌ అయినట్లు కనిపిస్తుంది. యాక్షన్‌, థ్రిల్‌, లవ్‌ ఇలా షడ్‌ రుచుల సమ్మేళనంగా ట్రైలర్‌ కనిపిస్తుంది. నాగచైతన్య లుక్‌ కూడా కొత్తగా, చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక చాలా కాలం తర్వాత కృతికి మంచి పాత్ర పడ్డట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది.

ఇక విలన్‌ను అంతమొందించే హీరోల సినిమాలు మనం ఎన్నో చూసుంటాం. కానీ ఈ సినిమాలో విలన్‌ను నాగచైతన్య కాపాడబోతున్నట్లు తెలుస్తుంది.’ న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది’ అంటూ చైతన్య పలికే సంభాషణలు ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఇక ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా నేపథ్య సంగీతం ట్రైలర్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుంది అని అనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ఉన్న అంచనాలను కస్టడీ ట్రైలర్‌ రెట్టింపు చేసింది. ప్రియమణి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్‌ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular