Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Hockey: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

CWG-2022: Hockey: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల హాకీ విభాగంలో ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా గా ముగిసింది. మూడో క్వార్టర్ ముగిసే వరకూ 3-1తో ఇండియా ఆధిక్యంలో ఉంది. చివరి భాగంలో ఇంగ్లాండ్ సత్తా చూపి ఇండియాను నిలువరించింది.

ఆట మూడో నిమిషంలోనే లలిత్ కుమార్ ఉపాధ్యాయ పెనాల్టీ కార్నర్ ను గోల్ చేసి స్కోరు బోణీ చేశాడు. 13, 22నిమిషాల్లో  మన్ దీప్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేసి ఇండియా ఆధిక్యాన్ని 3-0కు తీసుకెళ్ళాడు. 42వ నిమిషంలో ఇంగ్లాండ్ తొలి గోల్ చేసింది, ఆ కాసేపటికే హర్మన్ ప్రీత్ సింగ్ ఇండియాకు మరో పెనాల్టీ కార్నర్ గోల్ అందించి 4-1చేశాడు. ఈ దశలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మైదానంలో చురుగ్గా కదిలి 47, 51, 53నిమిషాల్లో మూడు ఫీల్డ్ గోల్స్ చేసి మ్యాచ్ ను డ్రా చేసుకున్నారు.

పూల్ ‘ఏ’ లో మూడు మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ ఏడు పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయం, ఒక డ్రాతో నాలుగు పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇండియా తన తరువాతి మ్యాచ్ ను ఆగస్ట్ 3న కెనడాతో ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular