Sunday, June 7, 2026
HomeTrending Newsసైబరాబాద్ సీపీ బదిలీ

సైబరాబాద్ సీపీ బదిలీ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను TSRTC ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా నియమించారు. కాగా మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలందించిన సజ్జనార్.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్ లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్లోనూ గుర్తింపు పొందారు.

మరోవైపు నలుగురు సీనియర్ ఐ.పి.ఎస్.లకు డీజీపీ లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  1990 బ్యాచ్ అధికారులు అంజనీ కుమార్, రవిగుప్తా, గోవింద్ సింగ్, 1989 బ్యాచ్ అధికారి ఉమేష్ ష్రాఫ్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular