Wednesday, May 7, 2025
HomeTrending NewsWeather: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు

Weather: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్‌గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోచా తుఫాన్‌ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ అండమాన్‌, వాయవ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని హెచ్చరించింది.

అల్ప పీడన ద్రోణి ఈ రోజు సాయంత్రం కల్లా బలహీనపడిందని ఐఎండీ పేర్కొన్నది. సైక్లోన్‌ మోచ..శుక్రవారం నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందని వివరించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఆదిలాబాద్‌లో 41.3, ఖమ్మంలో 40, నల్లగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 38.8, హనుమకొండ 38, హైదరాబాద్‌ 36.6, మెదక్‌ 39, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు మారుతున్న వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియక సతమతమవుతున్నారు. కాలు బయట పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఓ వైపు మోచా తుపాన్ ముప్పు తప్పడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. పగలు మండే ఎండలు..రాత్రి అయితే వర్షాలు అంటూ జనాలు భయపడుతున్నారు. అయితే మోచా తుపాన్ గండం తప్పడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్