Tuesday, June 16, 2026
Homeసినిమాకృషి, అంకిత భావం, పట్టుదల ఉన్నవారినే విజయం వరిస్తుంది - దిల్ రాజు

కృషి, అంకిత భావం, పట్టుదల ఉన్నవారినే విజయం వరిస్తుంది – దిల్ రాజు

ప్రముఖ దర్శకులు “అంకురం” ఉమామహేశ్వరరావు సారథ్యంలో అందరికీ అందుబాటులో… అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతున్న “దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” ఆరవ స్నాతకోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ… సినిమా రంగానికి అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్రియేటివిటితో పాటు కృషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారిని మాత్రమే సినిమా రంగం విజయాలు అందిస్తుందని ఈ సందర్భంగా దిల్ రాజు పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శకనిర్మాత డాక్టర్ గౌతమ్ విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. “దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” డీన్ మధు మహంకాళి, ప్రిన్సిపాల్  నందన్ బాబు సమక్షంలో విద్యార్థినీ విద్యార్థులకు దిల్ రాజు సర్టిఫికెట్స్, పతకాలు అందించారు. శిక్షణలో భాగంగా స్టూడెంట్స్ తెరకెక్కించిన లఘుచిత్రాల పై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular