Friday, March 29, 2024
Homeసినిమా‘భీమ్లా నాయక్' నుంచి ‘డేనియల్ శేఖర్‘లుక్ రిలీజ్

‘భీమ్లా నాయక్’ నుంచి ‘డేనియల్ శేఖర్‘లుక్ రిలీజ్

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లుక్ రిలీజ్ చేసిన టీమ్ ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ‘రానా‘ పరిచయ చిత్రాన్ని విడుదల చేశారు. డేనియల్ శేఖర్ గా రానా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది.

“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది…
నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో ..హీరో..!
డేనీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్…!”

అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలతో ఈ కర్టెన్ రైజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని 2022 జనవరి 12 న  విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్