Monday, March 16, 2026
Homeసినిమారూట్ మార్చిన వెంకటేశ్!

రూట్ మార్చిన వెంకటేశ్!

వెంకటేశ్ .. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. మొదటి నుంచి కూడా ప్రయోగాలు చేయడానికి ఎంతమాత్రం వెనుకాడని హీరోగా వెంకటేశ్ కి పేరుంది.  చాలా కాలం క్రితమే రీమేక్ సినిమాలను రంగంలోకి దింపిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఇక మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడక పోవడం విశేషం. పవన్ .. మహేశ్ బాబు .. వరుణ్ తేజ్ లతో కలిసి మల్టీ స్టారర్ మూవీస్ చేసిన ఆయన, వరుస విజయాలను అందుకున్నారు.

ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో కావడం వెంకటేశ్ లో కనిపిస్తుంది. సీనియర్ స్టార్ హీరోల వైపు నుంచి వెబ్ సిరీస్ ల దిశగా ముందుగా అడుగులు వేసింది ఆయనే. ఇక కొత్తగా వచ్చిన దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోను ఆయన ముందుంటున్నారు. ఇంతవరకూ ఒకటి రెండు సినిమాలు చేసిన శైలేశ్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ చేయడం విశేషం. పైగా ఇది వెంకటేశ్ కి 75వ సినిమా. సంఖ్యా పరంగా ప్రాధాన్యతను కలిగిన సినిమా. అయినా వెంకీ  కొత్తగా వచ్చిన దర్శకులకు అవకాశం ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకపోవడం విశేషం.

నిన్ననే ‘సైంధవ్’ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్స్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్స్ ను గమనిస్తే ప్రమోషన్స్ విషయంలో వెంకీ మరో అడుగు ముందుకు వేసినట్టుగా అనిపిస్తుంది. స్టేజ్ పై ఆయన చాలా హుషారుగా కనిపించారు. స్టూడెంట్స్ తోను .. లెక్చరర్స్ తోను జోక్స్ వేశారు. అంతేకాదు స్టేజ్ పై స్టెప్స్ వేశారు. గతంలోనూ ప్రమోషన్స్ లో వెంకీ పాల్గొన్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయన రూట్ మార్చారు. బాలీవుడ్ హీరోల తరహాలో ఆయన జనంలోకి దూసుకుపోవడం స్పష్టంగా కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular