Saturday, January 18, 2025
Homeసినిమా‘నారప్ప’ ఓటీటీలోనా? థియేటర్స్ లోనా?

‘నారప్ప’ ఓటీటీలోనా? థియేటర్స్ లోనా?

విక్టరీ వెంకటేష్‌ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నారప్ప. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో రానుందని.. నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు భారీ మొత్తానికి అమ్మేశారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. తెలంగాణా ఫిలిం చాంబర్ అక్టోబర్ వరకూ ఓ టి టి కి వెళ్ళకుండా ఆగాలని నిర్మాతలను  కోరారు.

వెంకటేష్ అభిమానులు కూడా ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో వద్దని, థియేటర్లోనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఓ అభిమాని అయితే.. ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పరిణామాలతో  సురేష్‌ బాబు ఆలోచనలో పడ్డారని.. ఓటీటీ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి వెంకీ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్