భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కన్న కలలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. దళితబంధు యూనిట్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన దళితబంధు యూనిట్లను ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టివేయ బడ్డారు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమం చేపట్టారని అన్నారు. దళిత బంధు పథకం భావితరాలకు దోహదపడుతుంది. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక యూనిట్ తీసుకొని సమిష్టిగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు డ్రైవర్లు ఉన్నవారు.. నేడు ఓనర్లు అయ్యారని అన్నారు. అతి త్వరలోనే గ్రౌండింగ్ పూర్తి చేసి, అందరికీ యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read : రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు – మంత్రి గంగుల