Friday, March 29, 2024
HomeTrending Newsఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్

ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్

Pakistan Crisis : రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనుందని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి మీఫ్తః ఇస్మాయిల్ హెచ్చరించారు. శుక్రవారం  బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ఈ వ్యాఖ్యలు చేయటం పాకిస్తాన్ లో నెలకొన్న గడ్డు పరిణామాల్ని ప్రతిభింభించింది. గత 30 ఏళ్ళలో ఎన్నడు లేని విధంగా పాకిస్తాన్ గడ్డు కాలాన్ని ఎదుర్కుంటోదని ఆర్థిక క్రమశిక్షణ పై బద్దలు కొట్టారు. విద్యుత్ ఉత్పత్తి తలకు మించిన భారంగా మారిందని, కటినమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు.

పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 209, డీజిల్ ధర రూ. 204కు చేరింది. దీంతో సామాన్యుడు చతికిల పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దేశంలో ధరలు ఇలా పెరిగితే భవిష్యత్ లో మరిన్ని కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు ఏకంగా రూ. 60 మేర పెరడం ఆందోళనకరమే.

ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్నేహహస్తం అందించాలని సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా సాయం చేయాలని కోరుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉండటంతో ఏ దేశం కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకమే. దీంతో పాకిస్తాన్ మరింత అగాధంలోకి పడిపోయే ప్రమాదమే కనిపిస్తోంది.

దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించే ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడాలంటే డబ్బు కావాల్సిందే. ప్రస్తుతం దేశంలో సంక్షోభం తలెత్తడానికి డబ్బు లేకపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకున్నా ప్రయోజనం శూన్యమే. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని బ్యాంకుల్లో ఉన్న ధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడదామంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్