Saturday, July 27, 2024
HomeTrending Newsబలోచిస్తాన్ లో పాక్ సైన్యం అకృత్యాలు

బలోచిస్తాన్ లో పాక్ సైన్యం అకృత్యాలు

ప్రపంచ దేశాలు రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దృష్టి సారించిన తరుణంలో పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లో దారుణాలకు పాల్పడుతోంది. మిలిటెంట్ల పేరుతో పదిమంది బలుచ్ పౌరుల్ని ఈ రోజు పాకిస్తాన్ బలగాలు ప్రాణాలు తీశాయి. మృతుల వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించిందని పాక్ సైన్యం వెల్లడించింది. హొశాబ్ ప్రాంతంలోని  తుర్బాట్ – పస్ని గ్రామాల మధ్య సైన్యంపై కాల్పులు చేయటంతో మిలిటెంట్లను హతమార్చామని సైనిక అధికారులు వివరించారు.

అటు ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో తీవ్రవాదులుగా అనుమానించి ముగ్గురిని పాక్ సైన్యం చంపటం అక్కడ ఆందోళనలు, నిరసనలకు దారితీసింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో స్థానిక ప్రజల నుంచి పాక్ సైన్యం తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కొంది. ఒకానొక దశలో నిరసనకారులు జిల్లా కేంద్రంలో పోలీసు ప్రధాన కార్యాలయం పై దాడికి ప్రయత్నించారు.

బలోచిస్తాన్ లో సైన్యం చర్యల్ని బలూచ్ పౌర సంఘాలు విమర్శిస్తున్నాయి. పేదరికంతో ప్రజలు ఆకలికి అలమటిస్తుంటే తీవ్రవాదుల పేరుతో అమాయక ప్రజల్ని ప్రాణాలు తీస్తున్నారని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిని తీవ్రవాదుల పేరుతో పాక్ ప్రభుత్వం చంపుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. గ్వదర్ రేవులో స్థానిక బలూచ్ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా చైనా సంస్థలు అడ్డుపడుతున్నాయి. చైనా కంపెనీలకు పాక్ ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తోంది. దీంతో స్థానిక యువత చైనా వారు కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఇదే క్రమంలో అడ్డు వస్తున్న పాక్ సైన్యం పై కూడా దాడులు చేసి హతమారుస్తున్నారు.

Also Read : తాలిబాన్ల పాలనతో ప్రజల ఇక్కట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్