Friday, March 29, 2024
Homeసినిమా“ద‌మ్మున్నోడు” షూటింగ్ ప్రారంభం

“ద‌మ్మున్నోడు” షూటింగ్ ప్రారంభం

బి.కె.ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై శివ‌ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం `ద‌మ్మున్నోడు`. ‘దుమ్ము దులుపుతాడు’ ట్యాగ్ లైన్‌. బాలాజీ కొండేక‌ర్, రేణుక కొండేక‌ర్ నిర్మాత‌లు. ప్రియాంశ్‌, గీతాంజ‌లి, స్వ‌ప్ప హీరోయిన్స్. హైద‌రాబాద్‌లోని రాక్ క్యాసిల్ హోట‌ల్ లో సినిమా ప్రారంభ‌మైంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ప్ర‌స‌న్న కుమార్ తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా మ‌రో ప్ర‌ముఖ‌ నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ సత్యనారాయ‌ణ కెమెరా స్విచాన్ చేశారు.

హీరో-డైర‌క్ట‌ర్ శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ… “నా మొద‌టి సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రోత్స‌హిస్తూ వ‌స్తోన్న ప్ర‌స‌న్న కుమార్ గారికీ, రామ‌స‌త్య‌నారాయ‌ణ గారికీ, ఫిలించాంబ‌ర్ వారికీ నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. నా క‌థ‌, టైటిల్ న‌చ్చి మా నిర్మాత బాలాజీ గారు ఈ సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ప‌వ‌ర్ ఫుల్ స్టోరి, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్ తో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ రోజు ఫైట్ తో షూటింగ్ ప్రారంభించాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాకు ఫైట్స్ ప‌రంగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ ప‌రంగా కూడా పేరొస్తుందన్న న‌మ్మ‌కం ఉంది. ఇందులో నాలుగు పాట‌లు అద్భుతంగా కుదిరాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తాం” అన్నారు.

నిర్మాత బాలాజీ కొండేక‌ర్ మాట్లాడుతూ… “సొలో ప్రొడ్యూస‌ర్ గా నాకిది తొలి సినిమా. గ‌తంలో `సూప‌ర్ ప‌వ‌ర్‌` చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించా. ద‌మ్మున్నోడు క‌థ‌, టైటిల్ న‌చ్చి నిర్మిస్తున్నా. ఇందులో ఏడు భారీ ఫైట్స్, నాలుగు అద్భుత‌మైన పాట‌లు ఉంటాయి. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేశాం” అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు ఎల్.ఎమ్ ప్రేమ్ , కొరియోగ్రాఫ‌ర్ బ్ర‌ద‌ర్ ఆనంద్‌, హీరోయిన్ ప్రియాంశ్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్