Sunday, January 19, 2025
Homeసినిమాఆస్కార్ వేదిక పై డ్యాన్స్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్‌

ఆస్కార్ వేదిక పై డ్యాన్స్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్‌

ఆర్ఆర్ఆర్ మూవీలో ‘నాటు నాటు‘ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం.. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ అందుకోవడం తెలిసిందే. ఈ విధంగా పాట ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ పాటను ఆస్కార్ వేదిక పై కాలభైరవ, రాహుల్ సిప్లిఘంజ్ పాడారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ లైవ్ లో ఈ పాటకు డ్యాన్స్ చేయనున్నారని ఆతృతగా ఎదురు చూసిన జనాలకు నిరాశే ఎదురైంది.

అసలు ఏం జరిగింది..? ఎందుకు ఎన్టీఆర్, చరణ్ లైవ్ లో డ్యాన్స్ చేయలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీని పై చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ చరణ్ ఏం చెప్పారంటే..
ఆస్కార్ వేదిక పైన నాటు నాటు పాటకి డ్యాన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఛాన్స్ వస్తే.. చేద్దామని వెయిట్ చేసాను. అయితే.. ఏం జరిగింది అనేది తనకు కూడా తెలియదు. ఫైనల్ గా ఫారిన్ టీమ్ డ్యాన్స్ చేసింది. అయితే.. మాకంటే వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారని రామ్ చరణ్ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే.. తారక్, చరణ్ గురించి ఆస్కార్ వేదిక పై కీరవాణి ప్రస్తావించలేదు. దీని పై అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు హర్ట్ అయ్యారు.

దీని పైన కూడా చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారంటే.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత ఆ వేదిక పైన మాట్లాడడానికి కేవలం 45 సెకండ్స్ మాత్రమే టైమ్ ఇస్తారు. అక్కడ టైమ్ ప్రకారమే మాట్లాడాలి. ఒకవేళ ఆ టైమ్ దాటి మాట్లాడాలని ట్రై చేసిన మైక్ కట్ చేస్తారు. ఇక ఆ స్పీచ్ కోసమే రాజమౌళి.. కీరవాణి గారితో ఏకంగా 20 సార్లు రిహార్సల్స్ చేయించారు. ఇక స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కీరవాణి గారు కూడా అద్భుతంగా మాట్లాడారు. అందులో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చరణ్‌ చెప్పారు. ఇక హాలీవుడ్ లో నటించాలనే ఆసక్తి తనకి ఉంది. అదే విషయాన్ని లాస్ ఏంజిల్స్ లో చెప్పాను. అయితే.. ఎప్పుడు ఉంటుంది..? ఎవరితో ఉంటుంది..? అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు మెగా పవర్ స్టార్.

Also Read : చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్: ‘నాటు నాటు’ కు ఆస్కార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్