రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం.. శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చే్స్తుండడం విశేషం. కైరా అద్వానీ కథానాయిక అయితే.. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు.

అయితే.. ‘ఆర్సీ 15’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. చరణ్ పుట్టినరోజున ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి చేసుకుంది. ఈ మూవీ కోసం మేకర్స్ పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. ఇంతకీ.. ఆ టైటిల్స్ ఏంటంటే.. ‘సేనాని’, ‘సేనాపతి’, ‘సీ.ఈ.వో’, ‘సైనికుడు’ అనే టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ మూవీ టీమ్ లో ఎక్కువ మంది సేనాని వైపు మొగ్గు చూపారని.. శంకర్ మాత్రం సైనికుడు అనే టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం.

అయితే.. సేనాని, సైనికుడు.. ఈ రెండు టైటిల్స్ లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి. అన్ని భాషల వాళ్లకు కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టాలి. అందుచేత సీఈవో టైటిల్ అయితే.. అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారట. చరణ్‌ పుట్టినరోజున టైటిల్ అనౌన్స్ చేస్తారు అని గత కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. అందుచేత టైటిల్ విషయంలో క్లారిటీ రావాలంటే.. చరణ్ బర్త్ డే వరకు ఆగాల్సిందే. ఈ మూవీని డిసెంబర్ లో లేదా జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ఎమోషనల్ మూమెంట్ – ఎన్టీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *