Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rishikonda Temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  విశాఖ నగరం రుషికొండపై  రూపుదిద్దుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి నంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.  రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు  ఈ నెల 18న అంకురార్పణతో మొదలయ్యాయి.

ఐదు రోజులు యజ్ఞయాగాదులు నిర్వహించి నిన్న బుధవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనతరం నిన్న సాయంత్రం  శ్రీనివాసకల్యాణ మహోత్సవం కూడా జరిగింది.  నిన్నటి నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com