Friday, April 19, 2024
Homeసినిమావిశ్వక్ సేన్ కు మైల్ స్టోన్ మూవీ : నివేదా పేతురాజ్

విశ్వక్ సేన్ కు మైల్ స్టోన్ మూవీ : నివేదా పేతురాజ్

Nivetha Pethuraj: విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా విశేషం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌ గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మీడియాతో చెప్పిన దాస్ కా ధమ్కీ’ విశేషాలు ఆమె మాటల్లోనే…

‘పాగల్’ చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’ కి కాల్ వచ్చింది కానీ.. ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ధమ్కీ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది. కెరీర్ లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా గ్లామరస్ రోల్. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. నాకు బాగా నచ్చింది. ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.

హీరో నిర్మాతగా చేయడం వేరు. దర్శకత్వం చేయడం వేరు. ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఇక దర్శకుడిగా అయితే.. విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను.

విశ్వక్ గొప్ప ఎనర్జీ వున్న దర్శకుడు. తన దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ వున్నాయి. అయితే.. తానే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్ లో చాలా మాస్ వుంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ వుంది. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో వుంది. తనకి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి.

దాస్ కా ధమ్కీ’ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. అలాగే దాస్ కా ధమ్కీ’ విశ్వక్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది. నాకు కూడా దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. అయితే.. ఇప్పుడే కాదు. నిర్మాణం మాత్రం చేసే ఆలోచన లేదు. నటనతో పాటు బిజినెస్ పై కూడా దృష్టి పెడుతున్నాను. చెన్నయ్ లో రెస్టారెంట్ ఒకటి ప్రారంభించాను. సుస్మిత గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాను. హిందీ టీ సిరిస్ లో ఒక సినిమా చేస్తున్నాను.

Also Read : 22న ‘దాస్ కా ధమ్కీ’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్