‘దసరా’ ఇండస్ట్రీ గర్వపడే సినిమా అవుతుంది: హీరో నాని

నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘దసరా’ రెడీ అవుతోంది. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వ్యవహరించాడు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంటును హైదరాబాదు లోని ఎ.ఎమ్.బి. సినిమాస్ లో నిర్వహించారు. ‘ఓరి వారి .. నీది గాదుర పోరి’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

బొగ్గుగని నేపథ్యంలో .. రాత్రివేళలో .. హీరో ఆవేదనను అర్థం చేసుకుని, ఆయనను ఓదార్చుతూ సాగే పాట ఇది. సంతోష్ నారాయణ్ స్వరపరచడమే కాకుండా ఈ పాటను ఆయనే ఆలపించాడు. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట, కథ నేపథ్యానికి తగిన యాసతో నడుస్తోంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. నాని జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటించింది. సముద్రఖని .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

సాంగ్ లాంచ్ ఈవెంటులో నాని మాట్లాడుతూ .. “నా కెరియర్ లో ఇంతవరకూ చాలానే పాటలు వచ్చాయి .. కానీ ఇది నా బెస్ట్ సాంగ్. ఈ పాట నాకు బాగా కనెక్ట్ అయింది. అలాగే లవ్ లో పడిన ప్రతి ఒక్కరికీ .. బ్రేకప్ అయినవారికి ఈ పాట తప్పక కనెక్ట్ అవుతుంది. అన్ని భాషలకి చెందిన ప్రేక్షకులు ఒక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసినప్పుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. అలా ఇది ఇండస్ట్రీ గర్వపడే సినిమా అవుతుంది. రిలీజ్ అయిన తరువాత మీరూ ఇదే మాట అంటారు” అని చెప్పుకొచ్చాడు.

Also Read :  ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తర్వాత దసరా. ఇది నిజమా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *