Tuesday, December 3, 2024
Homeసినిమాదాసరికి పద్మ అవార్డ్ ఇవ్వాలి - చిరంజీవి

దాసరికి పద్మ అవార్డ్ ఇవ్వాలి – చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణరావు 150 సినిమాల మైలురాయిని చాలా ఈజీగా దాటి.. అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడుగా చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో భారీ చిత్రాలు తెరకెక్కించి సంచలన విజయాలు అందించారు. అలాగే చిన్న సినిమాలను తెరకెక్కించి పెద్ద విజయాలను సాధించారు. అలాగే దర్శకుడే కెప్టెన్.. అని చాటిచెప్పి దర్శకుడుకు గౌరవం తీసుకువచ్చారు దాసరి. ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య వస్తే.. అందరూ చూసేది దాసరి ఇంటివైపే. సమస్య వచ్చిందంటే… దాసరి నేనున్నాను అంటూ ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారు. ఇలా.. ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన దాసరికి పద్మశ్రీ కానీ.. పద్మభూషణ్ కానీ.. ఇలా ఒక్క అవార్డ్ కూడా రాలేదంటే ఆశ్చర్యం కలగకమానదు.

ఈరోజు దర్శకరత్న దాసరి జయంతి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు దాసరిని గుర్తు చేసుకుంటున్నారు. దాసరి జయంత సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి  ట్విట్టర్ లో స్పందిస్తూ… దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి. విజయాలల్లో ఒక దానికి మించిన మరో చిత్రాలని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే. శ్రీ దాసరికి ఇప్పటికీ తగిన గుర్తింపు రాకపోవడం తీరనిలోటు. ఆయనకి పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుంది అన్నారు.

దాసరికి పద్మ అవార్డ్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు చిరు మాటలతో దాసరికి పద్మ అవార్డ్ ఇవ్వాలనే డిమాండ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. మరి.. ఇకనైనా దాసరి చేసిన సేవలకు గాను పద్మ అవార్డ్ ఇస్తారని ఆశిద్దాం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్