Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగతి తప్పిన పాఠం

గతి తప్పిన పాఠం

Punishment for Students?:
తప్పుచేసింది మద పిచ్చి కలిగిన ఇద్దరు. వారిద్దరూ ఇప్పుడు వేర్వేరుగా జైలులో… శిక్ష అనుభవిస్తున్నారు … ఇంకా అనుభవిస్తారు కూడా! అందాకా బాగానే ఉంది!

కానీ …
ఒకే స్కూల్ లో ఒక తరగతిలో రెండో మూడో సెక్షన్స్ ఉన్నాయనుకొందాము. ఒక విద్యార్థిని సెక్షన్ మారిస్తే బాధపడతారు. అడ్జస్ట్ కావడానికి సమయం పడుతుంది. స్నేహితుల్ని కోల్పోయామన్న బెంగ పెట్టుకొంటారు. ఒక్కో సారి ఇది వారి చదువును దెబ్బ తీయవచ్చు. టీచర్ మారినా, కొత్త టీచర్ బోధనా పద్ధతులకు అలవాటు పడ లేక ఇబ్బంది పడతారు.

అలాంటిది ఇప్పుడు స్కూల్ మూసేస్తే, శిక్ష ఎవరికి? చెట్టుకో పుట్టకో విద్యార్ధి అయిపోతారు. అందరి చదువు ఎంతో కొంత దెబ్బ తింటుంది. ఎందుకు వారికీ శిక్ష?

పేరెంట్స్ ఫీజులు చాలా మటుకు పే చేసి ఉంటారు. ఇప్పుడు కొత్త స్కూల్ లో ఎట్లా ? బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ అంటే నగరం నడిబొడ్డు. అక్కడ స్కూల్స్ లో సీట్లు ఉండవు. సెక్షన్స్ లో ఎంతమంది ఉండాలో అంతమంది పిలల్లు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని అడ్జస్ట్ చేయాలంటే ముప్పై మంది ఉన్న సెక్షన్స్ లో నలబై యాభై అవుతారు. ఇది సీబీఎస్సీ నిబంధనలకు విరుద్ధం. సరే నిబంధనలను పక్కన పెట్టేదాము. ఒక్క సారిగా సెక్షన్స్ లో అంతమంది పెరిగితే కొత్తగా వచ్చిన విద్యార్థులే కాదు అక్కడ ఉన్న విద్యార్థుల చదువు కూడా దెబ్బ తింటుంది. పరిమితికి మించి క్లాస్ లో పిల్లలుంటే పాఠం చెప్పేదెలా? నోట్స్ కరెక్షన్ చేసేదెలా? వ్యక్తిగత శ్రద్ధ పెట్టేదెలా?

అంటే పాపం ఈ విద్యార్థులకే కాదు .. అక్కడి విద్యార్థులకు కూడా శిక్ష. ఎందుకు?

పాఠశాలంటే టీచర్లు .. సిబ్బంది .. వారి జీవితాలు పెనవేసుకొని ఉంటాయి. జీతాలు .. దాని ఆధారంగా లోన్ లు .. ఖర్చులు .. ఇప్పుడు వారి నోటి గ్గర కూడు లాగేసినట్టేనా?

 Dav School

మీడియా కథనాలు చూసి ఆవేశం పెంచుకున్న జనాలను సంతృప్తి పరచడానికి మూడేళ్ళ క్రితం ఎన్కౌంటర్ చేయించారు. ఆ కేసులో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్న పోలీస్ సిబ్బంది గోడును మీడియా కానీ, సోషల్ మీడియా కానీ పట్టించుకొందా? వారికి మద్దతుగా ఒక ప్రదర్శన చేద్దాము అని ఎవరైనా పిలుపు ఇస్తే ఆనాడు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అని అరచిన వారిలో ఒక్కరైనా కనీసం అర గంట సమయం చేసుకొని వస్తారా?

ఇప్పుడు ఈ కేసు… జనాల ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం స్కూల్ మూత…. జనాలకేమి తెలుసు .. స్కూల్ మూసేస్తే శిక్ష పిలల్లకు .. వారి తలితండ్రులకు .. టీచర్లకు.. సిబ్బందికి అని ? మరో రెండో మూడో రోజుల్లో ఇంకో వివాదం వస్తుంది. రాక పోయినా సృష్టిస్తారు. జనాలు అప్పటికి దీన్ని మరచిపోతారు. కానీ విద్యార్థులకు ఇది జీవిత కాల శిక్ష.

ఎందుకు?
మరి పరిష్కారం?
మనసుంటే మార్గముంటుంది.

కరోనా కాలంలో నేను ఇచ్చిన ఎన్నో సూచనలు అరణ్య రోదన అయ్యాయి. అవుతాయని తెలుసు. రాజకీయ పార్టీలతీరు అంతే అని తెలుసు. అధికార గణం గుడ్డిగా పని చేస్తుందని తెలుసు. అయినా ఇప్పుడు ఇంకోసారి.

నేను ఆ స్కూల్ ను నడుపుతా… ఉచితంగా… రూపాయ వద్దు. ప్రభుత్వం ఒకరో ఇద్దరో అధికారులను నియమించుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు .. అంటే ఫీజు వసూలు చేసుకోవడం .. జీతాలు ఇవ్వడం లాంటి విషయాలు వారే చూసుకోవచ్చు . అందులో నేను వేలు పెట్టను. అకాడమిక్ విషయాలు మాత్రం నేను చూసుకొంటాను.

ఈ రాష్ట్రం .. ఆ రాష్ట్రం అని కాదు .. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు . పార్టీ లు మారినా సీన్ మారదు . ప్రభుత్వాలు… అధికార గణం ఒకే రీతిలో పని చేస్తుంది. అది అంతే.

-వాసిరెడ్డి అమరనాథ్

Also Read :

ఆధునిక గజేంద్ర మోక్షణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్