Wednesday, February 26, 2025
Homeస్పోర్ట్స్ENG Vs. BAN: తొలి వన్డేలో ఇంగ్లాండ్ విజయం

ENG Vs. BAN: తొలి వన్డేలో ఇంగ్లాండ్ విజయం

బంగ్లాదేశ్ టూర్ ను ఇంగ్లాండ్ విజయంతో మొదలు పెట్టింది. ధాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో  మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నజ్ముల్ శాంటో-58; మహ్మదుల్లా­-31; తమీమ్ ఇక్బాల్-23 మాత్రమే రాణించారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్, మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలా రెండు; క్రిస్ ఓక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా ఇంగ్లాండ్ విజయానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఓ వైపు సహచరులు పెవిలియన్ బాట పడుతున్నా డేవిడ్ మలాన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకొని 145 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3; మెహిదీ మిరాజ్ 2; షకీబ్ అలీ, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

డేవిడ్ మలాన్ కే ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్