Monday, June 15, 2026
Homeసినిమావిజయశాంతి చేతుల మీదుగా ‘డెడ్ లైన్’ టీజర్ విడుదల

విజయశాంతి చేతుల మీదుగా ‘డెడ్ లైన్’ టీజర్ విడుదల

Deadline: శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్ పతాకం పై తాండ్ర గోపాల్ నిర్మాతగా, బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం “డెడ్ లైన్”. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్, సోనియా, కౌషిక్, ఐశ్వర్య, గోపికర్, శ్రీనివాసరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంంగా చిత్రం టీజర్ ని, లేడీ సూపర్ స్టార్.. డైనమిక్ హీరోయిన్ విజయశాంతి చేతులమీదుగా విడుదల చేయడమైనది.

ఈ సంద‌ర్భంగా విజయశాంతి మాట్లాడుతూ..”దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు..కొన్ని చిత్రాలలో కలిసి నటించాం…ఇప్పు తన దర్శకత్వంలో వస్తున్న డెడ్ లైన్ చిత్రం యొక్క టీజర్ ని నా ద్వారా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక అకృత్యాల నేపద్యంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ.. మోడరన్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ భరితంగా ఉండేలా..అందరినీ ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిచారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ మాట్లాడుతూ…”లేడీ అమితాబ్ గా పిలవబడే, లేడీ డైనమిక్ స్టార్ విజయశాంతి గారి చేతుల మీదుగా డెడ్ లైన చిత్రం టీజరు విడుదల కావడం మా అదృష్టం. వారు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకు సర్వదా కృతజ్ఞులం. ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తంది. పాన్ ఇండియా విలన్ అజయ్ ఘోష్ పాత్ర వినూత్నంగా తీర్చిదిద్దడం జరిగింది..అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది. డూప్ లేకుండా ఫైట్స్ చేసి అబ్బుర పరచింది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందింది. అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular