Monday, June 8, 2026
Homeసినిమాఎన్టీఆర్, ప్ర‌శాంత్ మూవీలో హీరోయిన్ ఎవరు?

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ మూవీలో హీరోయిన్ ఎవరు?

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. క‌న్న‌డ స్టార్ య‌శ్ ను ‘కేజీఎఫ్’ లో అంత ప‌వ‌ర్ ఫుల్ గా చూపిస్తే.. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను ఇంకెంత ప‌వ‌ర్ ఫుల్ గా చూపిస్తారనేది ఆస‌క్తిగా మారింది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. సినిమాకే హైలైట్ గా నిలిచే ఈ పాత్ర కోసం తమిళ హీరో విక్రమ్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉందట‌ టీమ్. విక్ర‌మ్,  దీపికా ప‌డుకునే ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ లో చేరితే ఈ సినిమాకు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే సంవ‌త్స‌రం సమ్మర్ నుంచి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత ఎన్టీఆర్ కు నార్త్ లో భారీగా క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారో..?  ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో..?  చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular