విమెన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ కు అర్హత సంపాదించింది. నేడు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. లీగ్ దశలో ముంబై, ఢిల్లీ చెరో ఆరు మ్యాచ్ లు గెల్చినా మెరుగైన రన్ రేట్ తో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిఛి టైటిల్ రేసులో నిలవగా ముంబై-యూపీ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ విజేతతో ఢిల్లీ ఫైనల్స్ ఆడుతుంది.
ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. యూపీ 30 పరుగులకు తొలి వికెట్ (శ్వేతా షెరావత్-19) కోల్పోయింది. జట్టులో తహిలా మెక్ గ్రాత్ 32 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. అలిస్సా హేలీ-36; సిమ్రాన్ షేక్-11 పరుగులు చేసింది. కిరణ్ నవ్ గిరే-2; దీప్తి శర్మ-3; సోఫీ ఎక్సెల్ స్టోన్ (డకౌట్)లు విఫలమయ్యారు.
ఎలీస్ క్యాప్సీ 3; రాధా యాదవ్ 2; జెస్ జోనాస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ తొలి వికెట్ కు 56 పరుగులు చేసింది. షఫాలీ-21; కెప్టెన్ మెగ్ లన్నింగ్-39 పరుగులు చేయగా జెమైమా రోడ్రిగ్యూస్ విఫలమై కేవలం మూడు పరుగులకే వెనుదిరిగింది. ఎలీస్ క్యాప్సీ34 రన్స్ తో రాణించగా జోనాస్సేన్ డకౌట్ అయ్యింది. మారిజానే కాప్-34 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
యూపీ బౌలర్లలో శబ్నిం ఇస్మాయిల్ రెండు; యశస్వి, ఎక్సెల్ స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఎలీస్ క్యాప్సీ కి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.