Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: ఢిల్లీ, బెంగుళూరు, బెంగాల్ విజయం

ప్రొ కబడ్డీ: ఢిల్లీ, బెంగుళూరు, బెంగాల్ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు మూడోరోజు జరిగిన మూడు మ్యాచ్ ల్లో ఢిల్లీ, బెంగుళూరు, బెంగాల్ జట్లు తమ ప్రత్యర్దులపై విజయం సాధించాయి.

మొదటి మ్యాచ్ లో యూ ముంబాపై దబాంగ్ ఢిల్లీ 31-27 తేడాతో విజయం సాధించింది. మొదటి అర్ధ భాగంలో 10-12తో వెనకబడిన ఢిల్లీ రెండో అర్ధభాగంలో పుంజుకొని 15-21తో ఆధిక్యం సాధించింది, దీనితో ఆట ముగిసే సమయానికి 31-27తో ఢిల్లీ విజయం సాధించింది.

రెండో మ్యాచ్ లో తమిళ్ తలైవాపై  బెంగుళూరు బుల్స్ 38-30 తేడాతో విజయం సాధించింది. మొదటి అర్ధ భాగంలో 19-13 ఆధిక్యం సంపాదించింది బెంగుళూరు. రెండో అర్ధ భాగంలో తమిళ్ జట్టు హోరాహోరీ తలపడింది.  బెంగుళూరు-తమిళ్ జట్లు 19-17 పాయింట్లు సాధించాయి. చివరకు 8 పాయింట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది.

మూడో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై  బెంగాల్ వారియర్స్ 31-28 తేడాతో విజయం సాధించింది. మొదటి అర్ధ భాగంలో బెంగాల్ 16-11 ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగం చివర్లో గుజరాత్ పుంజుకొని ఎదురుదాడి చేసి 17-15 తో ఆధిక్యం సాధించినా ఫలితం లేకపోయింది.  ఆట ముగిసే సమయానికి 31-28తో మూడు పాయింట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.

Also Read : కబడ్డీ లీగ్; సత్తా చాటిన ఢిల్లీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్