Friday, February 21, 2025
HomeTrending Newsయుద్ధ ట్యాంకులూ మేమే కొనాలా?: కేజ్రీవాల్

యుద్ధ ట్యాంకులూ మేమే కొనాలా?: కేజ్రీవాల్

ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. ‘‘కేంద్రం వ్యాక్సిన్లను కొనడం లేదు. అలాగని రాష్ట్రాలకు స్వేచ్ఛనూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా?.. సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా?’’ అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

ఇతర దేశాల లాగా కాకుండా భారత్‌లో ఆరు నెలల ఆలస్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు. మొదటి వ్యాక్సిన్ భారతీయులే భారత్‌లో తయారు చేశారని, అప్పటి నుంచి టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్