Saturday, March 7, 2026
HomeTrending Newsనెలాఖరు నుంచి లాక్​ డౌన్​ సడలిస్తాం : కేజ్రీవాల్​

నెలాఖరు నుంచి లాక్​ డౌన్​ సడలిస్తాం : కేజ్రీవాల్​

ఈ నెల 31 తర్వాత ఢిల్లీలో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు .కరోనాతో పోరు ఇంకా అయిపోలేదని, మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేజ్రివాల్ ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పిన సిఎం…. త్వరలోనే 2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడతామన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

గత 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదయ్యాయని కేజ్రివాల్ వెల్లడించారు. పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే నమోదైందన్నారు. కేసులు భారీగా తగ్గుతున్నాయని, ఇంకో వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు. ప్రస్తుతం మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని, అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు

కాగా, ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. కేసులు పెరిగిపోతుండడంతో వెంటనే లాక్ డౌన్ విధించిన ఢిల్లీ సీఎం.. ఫలితం రాబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular