Wednesday, March 18, 2026
HomeTrending Newsఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు.లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు మరియు హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల వంటి విషయాలలోను రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.

ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీవర్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్ బాక్సీ రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ పశువులపై మనీలాండరింగ్ కేసులు వంటి హై ప్రొఫైల్ కేసుల్లోనూ రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించి, గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ “ లీగల్ పవర్ లిస్ట్ ఆఫ్ 2020” లోనూ రాణా కి చోటు దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular