ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు(ఆదివారం) విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ లిక్కర్ కేసులో మరోసారి నోటీసులు ఇచ్చిందని విచారణకు సహకరిస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన మనీష్ సిసోడియా రేపు విచారణకు వస్తానన్నారు.
అయితే తన పట్ల కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మనీష్ సిసోడియా ఆరోపించారు. తాను ఇటువంటి వాటికి బెదిరేది లేదన్నారు. ఒకసారి తన ఇంట్లో సోదాలు చేశారని, ఏమీ లభించలేదని పేర్కొన్నారు. తాను సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.
Also Read : మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ నిరాకరణ